News8th Sep 02:36 PMSunil Byrisetty1 min read
నెల్లూరు బ్యారేజీ వద్ద ఉద్రిక్తత
రాష్ట్రంలో నీటి కోసం నిరసనలు తప్పడం లేదు. ఎల్ నినో కారణంగా నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో సాగునీటి కోసం వైసీపీ నిరసనకు దిగింది. దీంతో నెల్లూరు బ్యారేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సో
రాష్ట్రంలో నీటి కోసం నిరసనలు తప్పడం లేదు. ఎల్ నినో కారణంగా నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో సాగునీటి కోసం వైసీపీ నిరసనకు దిగింది. దీంతో నెల్లూరు బ్యారేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమశిలకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. చలో నెల్లూరు బ్యారేజీకి నెల్లూరు వైయస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నిరసనలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. బ్యారేజీపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులతో మాజీ మంత్రి కాకాణి, శైలజానాథ్ వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా బ్యారేజీ ముందు రైతులతో కలిసి బైఠాయించారు.