National13th Nov 01:21 PMSunil Byrisetty1 min read
బోర్డర్లో టెన్షన్, టెన్షన్.. ఎప్పుడేం జరుగుతుందో
ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి భారత్, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల
ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి భారత్, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లవద్దని యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్, పహల్గామ్, సోన్‌మార్గ్‌లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబు దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ఇక, ఈ దాడులపై కేంద్ర సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కేంద్ర మంత్రులు చెబుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.