News21st Sep 11:11 AMSunil Byrisetty1 min read
శాప్ కార్యాలయం వద్ద వైసీపీ VS డీఎస్సీ టీచర్లు
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైసీపీ VS డీఎస్సీ టీచర్లు నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ శాప్ కార్యాలయం వద్దకు 370 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైసీపీ VS డీఎస్సీ టీచర్లు నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ శాప్ కార్యాలయం వద్దకు 370 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన టీచర్లు చేరుకున్నారు. మా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు తీసుకువచ్చాం ఎవరికైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మేము నకిలీ క్రీడాకారులం కాదు నికార్సైన ఆటగాళ్లంటూ ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. వైసీపీ మా ఉద్యోగాలపై రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ టీచర్లు నినాదాలు చేశారు. నిజాలు తెలుసుకోండి నిందలు మానుకోండి అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. డీఎస్సీపై మరోసారి రోడ్డెక్కిన వైసీపీ శాప్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదానికి దిగారు.