Politics22nd Jul 02:52 PMSunil Byrisetty1 min read

బీజేపీ- కాంగ్రెస్ బాహాబాహీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విజయ టాకీస్‌ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యా

బీజేపీ- కాంగ్రెస్ బాహాబాహీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విజయ టాకీస్‌ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు(కాంగ్రెస్ కార్యాలయం) చేరుకుని ప్రతిపక్షనేత రాహుల్‌, ప్రియాంకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు.. ప్రతిగా కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు జెండా కర్రలు, నీళ్ల బాటిళ్లు, చెప్పులతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు. ఈ ఘటనతో విజయవాడ పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh
BJP Protest
Congress Protest
Vijayawada
Political Rally
Party Workers
Protest Rally
Law and Order
Police Intervention
ప్రజా నిరసన
రాష్ట్ర రాజకీయాలు
రాహుల్ గాంధీ
ప్రియాంక గాంధీ
ఆంధ్రరత్న భవన్
విజయ టాకీస్
Scroll for the next article