News24th Jul 03:08 PMSunil Byrisetty1 min read

అనంతపురంలో ఉద్రిక్తత

అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అనంతపురం కేఎస్ఆర్ కళాశాల వద్ద బంద్ చేయిస్తున్న వారిపై పోలీసు యా

అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అనంతపురం కేఎస్ఆర్ కళాశాల వద్ద బంద్ చేయిస్తున్న వారిపై పోలీసు యాక్ష‌న్‌ కు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ ఉద్రిక్తంగా మారింది. తోపులాట జరగడంతో విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ఈడ్చి పారేశారు. పలువురు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Andhra Pradesh
Anantapur
NEET
NEET Paper Leak
Student Protest
Student Unions
Police
Bandh
కేఎస్ఆర్ కళాశాల
అరెస్టులు
వాగ్వాదం
తోపులాట
Scroll for the next article