News16th Oct 01:09 PMSunil Byrisetty1 min read

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది. నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో రాళ్లదాడి జరిగింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి రెండు వర్గాలు నా

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది. నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో రాళ్లదాడి జరిగింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి రెండు వర్గాలు నామినేషన్ల దాఖలుకు వెళ్తుండగా ఘర్షణ తలెత్తింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగాయి. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పుంగనూరు ఘటనపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. పుంగనూరు ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్న వైసీపీ నామినేషన్లను ఆన్‍లైన్‍లో స్వీకరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
Scroll for the next article