News11th Jul 12:52 PMSunil Byrisetty1 min read
ఉండవల్లిలో ఉద్రిక్తత.. భూస్వాధీనంపై ఆందోళన
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవసరమైన భూములను సీఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. అందుకోసం భారీ సంఖ్యలో
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవసరమైన భూములను సీఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. అందుకోసం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పొలాల్లోని పంటను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు భూస్వాధీన ప్రక్రియ కొనసాగించగా, రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.