Politics22nd Oct 02:20 PMSunil Byrisetty1 min read

మళ్లీ ఉద్రిక్తత.. ఈసారి ఎంపీ అరెస్ట్

రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. తాజాగా మరోసారి కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రవీంద్రనాథ్‌రెడ్డిని పోలీసులు అరె

మళ్లీ ఉద్రిక్తత.. ఈసారి ఎంపీ అరెస్ట్
రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. తాజాగా మరోసారి కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రవీంద్రనాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి, పార్టీ కార్యాలయం నుంచి తరలించారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేశారు. స్థానిక ఎన్నికల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంది. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా హింసాకాండ కొనసాగుతోందని, టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. పోలీసులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని, నామినేషన్లు వేయొద్దంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే గత వైసీపీ పాలనలో ఇంతకు వంద రెట్లు జరిగిన విషయం మర్చిపోయారా అని టీడీపీ తిప్పికొడుతోంది.
Scroll for the next article