Politics31st Aug 12:07 PMSunil Byrisetty1 min read
జనసేనలో లుకలుకలు? సీనియర్ నేత అలక
జనసేన పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ప్రాధాన్యం తగ్గడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్,
జనసేన పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ప్రాధాన్యం తగ్గడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా బాధ్యతలు చూస్తున్న బాలినేనికి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరిన ఆయనకు, తగిన గుర్తింపు లభించకపోవడంపై ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. అయితే జనసేనలోని పాత కేడర్ బాలినేని ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారే పెత్తనం చేస్తూండటం.. కూటమిలో గొడవలు పెడుతున్న సూచనలు కనిపిస్తూండటంతో దూరం పెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.