National12th Nov 05:35 PMSunil Byrisetty1 min read
200 ఐఈడీ బాంబులతో ఉగ్ర కుట్ర!
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే సమయంలో విధ్వంసం సృష్టించాలనే ఉగ్రవాదుల కుట్రను భద్రతా వర్గాలు గుర్తించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యా
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే సమయంలో విధ్వంసం సృష్టించాలనే ఉగ్రవాదుల కుట్రను భద్రతా వర్గాలు గుర్తించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో భాగంగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011లో ముంబైలో జరిపినట్లు దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర కుట్ర పన్నినట్లు పసిగట్టారు. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి కీలక ప్రాంతాలు ఉగ్రవాదుల లక్ష్యాల్లో ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్‌లోనూ విధ్వంసం సృష్టించాలని పథకం రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.