National12th Nov 05:15 PMSunil Byrisetty1 min read
పాక్ మరోసారి కవ్వింపులు.. యుద్ధం తప్పదా?
పాకిస్థాన్ మరోసారి చిల్లర చేష్టలకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వె
పాకిస్థాన్ మరోసారి చిల్లర చేష్టలకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. సీఆర్‌పీఎఫ్ బృందాలు వెంటనే వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఒకప్పుడు, అంటే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కశ్మీర్‌లో, దేశవ్యాప్తంగా పాక్ ఉగ్రదాడులు జరగడం, వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా ఉండేది. అలాంటి సందర్భాలలో కాంగ్రెస్ ప్రధాని, కేంద్రమంత్రుల దిగ్బ్రాంతి ప్రకటనలు, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామనే ప్రకటనలు కూడా పరిపాటిగా వినిపించేవి. దాడి జరిగిన ప్రతీసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇలాగే ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక భారత్‌పై దాడి చేస్తే ప్రతి దాడి చేస్తూ, మళ్ళీ అలాంటి ఆలోచన చేసేందుకు భయపడేలా చేశారు.