News25th Apr 02:06 PMSunil Byrisetty1 min read
ఉగ్రవాదుల అలర్ట్.. ఉలిక్కిపడిన విజయవాడ!
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. వివిధ నగరాల్లో ఉగ్రవాదుల కదలికలు, సానుభూతిపరుల కోసం పోలీసులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది.
వివిధ నగరాల్లో ఉగ్రవాదుల కదలికలు, సానుభూతిపరుల కోసం పోలీసులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో విజయవాడ ఉలిక్కిపడింది.
నగరంలో నలుగురు సిమి సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు రెండు నెలల క్రితమే పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
విజయవాడలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేటలో పోలీసులు గాలిస్తున్నారు.