News15th Apr 05:03 PMSunil Byrisetty1 min read
SC వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ
ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చట్టం అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీస
ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చట్టం అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తెలంగాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వర్గీకరణ రిజర్వేషన్ చట్టం 2025ను అధికారికంగా అమలు చేసింది.
ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని 56 ఎస్సీ జాతులను మూడుగా వర్గీకరించి, ఉపజాతుల మధ్య న్యాయంగా లబ్ధిదారుల పంపిణీ జరగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.