Telangana6th Jul 03:26 PMSunil Byrisetty1 min read

తెలంగాణలో త్వరలో వాట్సప్ టికెట్

తెలంగాణ బస్సుల్లో త్వరలో వాట్సప్ బస్ టికెట్ సర్వీస్ ప్రవేశపెట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ స

తెలంగాణలో త్వరలో వాట్సప్ టికెట్
తెలంగాణ బస్సుల్లో త్వరలో వాట్సప్ బస్ టికెట్ సర్వీస్ ప్రవేశపెట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్తో UPI ద్వారా టికెట్ తీసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది. ఇవి ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS)లో భాగమని, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో వెబ్ సైట్ ద్వారా, యాప్ ద్వారా మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా టికెట్ సేవలు అందనున్నాయి.
Telangana News
Cm Revanth Reddy
TGSRTC
WhatsApp ticket
Bus ticket
digital bus passes
తెలంగాణలో త్వరలో వాట్సప్ టికెట్
Scroll for the next article