Telangana1st Jun 11:29 AMSunil Byrisetty1 min read

మిస్ వరల్డ్ గా థాయ్ సుందరి!

మిస్ వరల్డ్ పోటీల్లో ధాయ్ ల్యాండ్ బ్యూటీ ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. దాంతో జడ్జిలు ఆమెకే ఓట

మిస్ వరల్డ్ గా థాయ్ సుందరి!
మిస్ వరల్డ్ పోటీల్లో ధాయ్ ల్యాండ్ బ్యూటీ ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. దాంతో జడ్జిలు ఆమెకే ఓటేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ ఫైనల్స్ కు.. ఆయా దేశాల నుంచి 108 మంది అందగత్తెలు ప్రాతినిధ్యం వహించారు. భారత సుందరి నందిని గుప్తా.. టాప్ 20కి చేరుకున్నారు కానీ టాప్ లో నిలవలేకపోయారు. హైదరాబాద్‌లో ఈ వేడుక నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకు వచ్చింది. ఫైనల్స్ కోసం దేశంలోని ప్రముఖులంతా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఫ్యాషన్ పై ఆసక్తి ఉన్న అందరూ హాజరయ్యారు. వేదికపై ఇషాన్ ఖట్టర్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ పర్‌ఫామెన్స్ ఇచ్చారు. జడ్జిలలో సోనుసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్ ఉన్నారు. సోనుసూద్ కు బెస్ట్ మానవతావాది అవార్డు కూడా ఇచ్చారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి.
Telangana News
Thailand
missworld2025
opalsuchata crowned Miss World
మిస్ వరల్డ్ గా థాయ్ సుందరి
Scroll for the next article