News21st Jul 01:06 PMSunil Byrisetty1 min read

రేపటి నుండి ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’!

‘తల్లికి వందనం’ పథకం నిధుల పంపిణీ ప్రక్రియ జులై 22 నుంచి షురూ కానుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ కానుంద

రేపటి నుండి ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’!
‘తల్లికి వందనం’ పథకం నిధుల పంపిణీ ప్రక్రియ జులై 22 నుంచి షురూ కానుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ కానుంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీల లోపు దశలవారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు చేరనున్నాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ‘తల్లికి వందనం’ పేరుతో అనుమానాస్పద లింకులు పంపుతున్నారు. అలాంటి లింక్స్ పట్ల లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. "మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి లేదా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి" అంటూ మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. వాటిని క్లిక్ చేస్తే అకౌంట్లలోని డబ్బు నేరగాళ్ల బారిన పడుతుందని సూచిస్తున్నారు.
Andhra Pradesh
Thalliki Vandanam
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu Naidu
DBT
సైబర్ మోసాలు
ఫేక్ లింకులు
విద్యార్థులు
సంక్షేమ పథకం
Scroll for the next article