News14th Jun 12:29 PMSunil Byrisetty1 min read
తల్లికి వందనం రికార్డ్.. ఆరుగురికి రూ. 78 వేలు
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగాని పల్లి గ్రామానికి చెందిన వట్టెప్ప కుటుంబంలో ఆరుగురికి తల్లికి వందనం నిధులు వచ్చాయి. ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం పథకం డబ్బులు జమ
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగాని పల్లి గ్రామానికి చెందిన వట్టెప్ప కుటుంబంలో ఆరుగురికి తల్లికి వందనం నిధులు వచ్చాయి. ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావడం దేశంలోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఆరుగురు సంతానం ఉండగా.. అందరినీ చదివించాలనే ఆ కుటుంబానికి తల్లికి వందనం భరోసా కల్పించింది. వారికి విద్య అందించడానికి చాలా అవస్థలు పడాల్సి వచ్చేదని, అప్పులు చేయాల్సి వచ్చేదని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబుకు, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తు్న్నారు. వట్టెప్ప కుటుంబానికి సంబంధించి విద్యార్థులు మోహన కుమార్, శ్రీకాంత్, ప్రియాంక, కార్తీక్, కళ్యాణ్, అమూల్యలకు గాను రూ. 78 వేలు జమయ్యాయి.