Education4th Oct 05:25 PMSunil Byrisetty1 min read

తల్లికి వందనం వచ్చేస్తోంది.. రెండో వారంలో జమ!*

పాఠశాల, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందించే తల్లికి వందనం రెండో విడతకు సిద్ధమవుతోంది. ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం రాష్ట్రంలోని సుమార

తల్లికి వందనం వచ్చేస్తోంది.. రెండో వారంలో జమ!*
పాఠశాల, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందించే తల్లికి వందనం రెండో విడతకు సిద్ధమవుతోంది. ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తొలి విడతలో జులై 22న 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు జమయ్యాయి. కొత్తగా 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో చేరినవారు, సాంకేతిక కారణాలతో తొలి విడతలో ప్రయోజనం పొందనివారికి రెండో విడతలో సాయం అందించనున్నారు. ఆగస్టు 30న విడుదల కావాల్సిన నిధులు ఆలస్యమయ్యాయి. దీంతో అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలి. వాటి ఆధారంగా ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది.
Scroll for the next article