News10th Apr 03:55 PMSunil Byrisetty1 min read

కోలుకుంటున్న మార్క్.. థాంక్స్ చెప్పిన పవన్

ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బయటపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపి

కోలుకుంటున్న మార్క్.. థాంక్స్ చెప్పిన పవన్
ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బయటపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సింగపూర్ అగ్నిప్రమాద నిరోధక శాఖ పవన్ కుమారుడిని ఆస్పత్రిలో చేర్చగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నా కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన మీకు ధన్యవాదములు. మన వాళ్ళ ఆశీస్సులతో, దేవుని దయతో మార్క్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింద’ని పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు
Pawankalyan
Fire incident
Mark Sankar
పవన్ కళ్యాణ్
సింగపూర్
Scroll for the next article