News29th Jun 11:32 AMSunil Byrisetty1 min read
వక్ఫ్ ఆస్తులను కాపాడటం, ఆదాయాన్ని పెంచడం ముఖ్యం
సాధారణంగా వక్ఫ్ బోర్డ్ సమావేశాన్ని విజయవాడలోని కార్యాలయంలో నిర్వహిస్తుంటారని, కానీ ఇకనుంచి ప్రతి జిల్లా కేంద్రంలో వక్ఫ్ బోర్డ్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించి నెల్లూరు నుంచి ప
సాధారణంగా వక్ఫ్ బోర్డ్ సమావేశాన్ని విజయవాడలోని కార్యాలయంలో నిర్వహిస్తుంటారని, కానీ ఇకనుంచి ప్రతి జిల్లా కేంద్రంలో వక్ఫ్ బోర్డ్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించి నెల్లూరు నుంచి ప్రారంభించామని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన అధ్యక్షతన 4వ ఏపీ వక్ఫ్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అజీజ్ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వక్ఫ్ బోర్డ్ కు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసిందని అన్నారు. 386 కోట్ల రూపాయల నిధులను దారి మళ్ళించారని ఆరోపించారు. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపలేదని అన్నారు. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తున్నామని సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.