News10th May 04:12 PMSunil Byrisetty1 min read

ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం

ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీ పేర్కొంది. వారెవరంటే.. ముదస్సర్‌ ఖదాయిన్‌ ఖాస్‌ అలియాస్‌ అబు జుందాల్‌: ఇతను లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది. ఇతని అంత్యక

ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీ పేర్కొంది. వారెవరంటే.. ముదస్సర్‌ ఖదాయిన్‌ ఖాస్‌ అలియాస్‌ అబు జుందాల్‌: ఇతను లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది. ఇతని అంత్యక్రియలను పాక్ సైన్యం అధికారిక లాంఛనాలతో నిర్వహించినట్లు సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ అబ్దుల్‌ రవూఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్‌, పంజాబ్ (పాక్‌లోని) సీఎం, ఐజీ హాజరైనట్లు తెలుస్తోంది. హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌: జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో కీలక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌కు ఇతను పెద్ద బావమరిది. మహమ్మద్‌ యూసఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌ జీ అలియాస్‌ సలీమ్‌ అలియాస్‌ సాహబ్‌: జైషే ముఠా ముఖ్య ఉగ్రవాది. మసూద్‌ అజార్‌కు ఇతను మరో బావమరిది. ఐసీ-814 విమాన హైజాక్‌ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఖలీద్‌ అలియాస్‌ అబు అకాస: లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రదాడులకు ఇతను నేతృత్వం వహించాడు. ఫైసలాబాద్‌లో ఇతని అంత్యక్రియలకు పాక్‌ సీనియర్‌ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్‌ హాజరైనట్లు సమాచారం. మహమ్మద్‌ హసన్‌ ఖాన్‌: జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పీవోకేలోని జైషే ఆపరేషనల్‌ కమాండర్ ముఫ్తి అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ కుమారుడు. జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో ఇతనిది ప్రధాన పాత్ర.
Operation Sindoor
Pakistani Terrorists Killed
JeM Chief Masood Azhar Relatives
హఫీజ్ మహమ్మద్ జమీల్
మహమ్మద్ యూసఫ్ అజార్
ఖలీద్
మహమ్మద్ హసన్ ఖాన్
Scroll for the next article