News19th May 12:48 PMSunil Byrisetty1 min read

ఏపీలో గర్భిణులకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు రెడీ!

ఏపీలో గర్భిణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్ల కోసం రూ. 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల చేసింది. ఒక్కో కిట్‌కు రూ. 1410/- ఖర్చు పెట్టనుంది. ఏపీ ప్రభుత్వ

ఏపీలో గర్భిణులకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు రెడీ!
ఏపీలో గర్భిణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్ల కోసం రూ. 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల చేసింది. ఒక్కో కిట్‌కు రూ. 1410/- ఖర్చు పెట్టనుంది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనుంది. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించగా.. 2019 తరువాత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయింది. బేబీ కిట్ పథకంలో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెడ్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామగ్రి ఉంటుంది. ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు
Andhra Pradesh
TDP government
NTR Baby Kit Scheme
ఏపీలో గర్భిణులకు ప్రభుత్వం శుభవార్త
బేబీ కిట్ పథకంలో 11 రకాల సామగ్రి
Scroll for the next article