News9th Jun 01:44 PMSunil Byrisetty1 min read

మీ ఇంటికి ఆధార్ లింక్ చేయించుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "స్వర్ణ పంచాయతీ" విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇంటి యజమానుల ఇళ్లకు ఆధార్ లింకు చేయబడుతుంది. ఇకపై ఇళ్లకు స్వర్ణ ప

మీ ఇంటికి ఆధార్ లింక్ చేయించుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "స్వర్ణ పంచాయతీ" విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇంటి యజమానుల ఇళ్లకు ఆధార్ లింకు చేయబడుతుంది. ఇకపై ఇళ్లకు స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్‌లో ఆధార్ లింక్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పంట భూములు ఏ విధంగా ఆన్ లైన్ అవుతున్నాయో ఇక నుంచి పంచాయతీలలో ఇల్లు కూడా ఆ విధంగానే ఆన్ లైన్ విధానం పక్కాగా అమలవుతుంది. దీనివల్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇంటి పన్ను రశీదు ఆధారంగా ఇంటి రిజిస్ట్రేషన్‌లను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేస్తున్నారు. కొందరు తప్పుడు ఇంటి పన్ను రశీదులతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఆ విధానం ఉండదు. ఖచ్చితంగా ఆన్ లైన్‌లో ఆ ఇల్లు ఉండాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది. 2016-17 సంవత్సరం ఇంటి పన్నుల రివిజన్ సమయంలో కొందరు ఇంటి యజమానులు ఆధార్ కార్డులు ఇచ్చారు. వాటి ఆధారంగా గ్రామపంచాయతీలో ఆన్‌లైన్ చేస్తున్నారు. అయితే చాలామంది ఈ ఆధార్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల గ్రామపంచాయతీ సిబ్బంది వారి టార్గెట్ పూర్తి చేయడానికి ఏదో ఒక నెంబర్ వేస్తున్నారు. అది ఇంటి యజమానులకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మీ ఇల్లు సక్రమంగా ఆన్‌లైన్ అయిందో లేదో మీ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి చూసుకోవడం ఉత్తమం. ఇదిలా ఉండగా చాలా మంది ఇల్లు నిర్మించి అద్దెలకి ఇచ్చేస్తుంటారు.
Andhra Pradesh news
Swarna Panchayat
Link aadhar to your home
house tax receipts
మీ ఇంటికి ఆధార్ లింక్
పంచాయతీ వెబ్ పోర్టల్
Scroll for the next article