News30th Mar 09:48 AMSunil Byrisetty1 min read
ఉగాది పండుగతోపాటు.. మార్పునకు ఆరంభం
తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. కర్నాటక, తమిళనాడులో కూడా వేర్వేరు పేర్లతో ఈ పండుగని జరుపుకుంటారు. దక్షిణాది వాళ్లు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగని కేవలం సంవత
తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది.
కర్నాటక, తమిళనాడులో కూడా వేర్వేరు పేర్లతో ఈ పండుగని జరుపుకుంటారు.
దక్షిణాది వాళ్లు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగని కేవలం సంవత్సరం ప్రారంభమయ్యే రోజుగా గుర్తుంచుకుంటే సరిపోదు.
కాలంలో వచ్చే మార్పుకు ప్రారంభంగా ఈ పండుగని గుర్తుంచుకోవాలి.
ప్రగతి కేంద్రంగా సాగే ప్రకృతి, ఉగాది పండుగకి ఎక్కడలేని ప్రత్యేకతని తీసుకొస్తుంది.
చెట్టూ, చేమ.. పాడి, పంట ఉగాది కాలం నుండే కొత్త రూపాలు సంతరించుకుంటాయి.
అందుకే ఉగాది ప్రకృతి పండుగ అయ్యింది. ప్రకృతి పట్ల అవగాహన, ప్రకృతితో సమన్వయం, పర్యావరణ స్పృహ, ప్రకృతి ప్రత్యక్షంగా, పరోక్షంగా నేర్పే పాఠాలను అన్వయించుకోవటం- విజ్ఞత. ఆ పరిధిని, పరిమితిని గుర్తెరిగి, ఉగాదిని మనం ఆస్వాదించాలి.
ఉగాది ప్రారంభమే.. వేసవి ఆరంభం.. వేసవి జాగ్రత్తలు పాటించమని కూడా ఈ పండుగ చెబుతుంది.
ఉగాది తరువాత ఎండలు పెరుగుతాయి. పిల్లలు, పెద్దలు డీహైడ్రేషన్‌కి గురికాకుండా చూసుకోవాలి.
ప్రాంతాలు వేరైనా ఈ రోజు ప్రతిఒక్కరూ చేసుకునే రకరకాల పిండివంటల్లో ఈ ఆరోగ్య సూత్రాలు తప్పకుండా ఉంటాయి.