News13th May 11:52 AMSunil Byrisetty1 min read

కాలువ‌ల త‌వ్వ‌కం పనులకు టార్గెట్ నెలాఖ‌రు!

రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత, గుర్ర‌పుడెక్క,తూటికాడ‌ తొల‌గింపు,ష‌ట్ట‌ర్లు, గేట్ల మ‌ర‌మ్మ‌త్తులు, గ్రీజు పెట్ట‌డం వంటి నిర్వ‌హణ ప‌నులను నెలాఖరులోగా పూర్తి చేయాలని జలవనరుల

కాలువ‌ల త‌వ్వ‌కం పనులకు టార్గెట్ నెలాఖ‌రు!
రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత, గుర్ర‌పుడెక్క,తూటికాడ‌ తొల‌గింపు,ష‌ట్ట‌ర్లు, గేట్ల మ‌ర‌మ్మ‌త్తులు, గ్రీజు పెట్ట‌డం వంటి నిర్వ‌హణ ప‌నులను నెలాఖరులోగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రూ. 344 కోట్ల విడుద‌ల చేశార‌ని తెలిపారు. ఈ ప‌నుల‌ను స్వీయ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ, మే చివ‌రి నాటికి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు విజ‌య‌వాడ‌లో జ‌ల‌వ‌న‌రుల క్యాంపు కార్యాల‌యం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఎస్ఈల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గుర్ర‌పుడెక్క‌, తూటికాడ వంటి వాటి తొల‌గింపుకోసం,మందుల పిచికారీకి డ్రోన్లు సైతం వినియోగించుకోవాల‌ని సూచించారు.
Vijayawada
canal excavation works
Nimmala Ramanaidu with the teleconference of irrigation officers
చంద్ర‌బాబు రూ. 344 కోట్ల విడుద‌ల
రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత
గుర్ర‌పుడెక్క
తూటికాడ‌ తొల‌గింపు
Scroll for the next article