News7th Apr 07:07 PMSunil Byrisetty1 min read
అమరావతికి నిధుల వరద.. 4285 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,285 కోట్లు విడుదల చేసింది.
రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది.
కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది.
అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25 శాతం నిధులు అడ్వాన్స్ ఇవ్వాలని సీఆర్డీయే కోరింది.
ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతికి భారీగా నిధులు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల కూడా ఒకసారి నిధులు విడుదలయ్యాయి.