News7th May 05:55 PMSunil Byrisetty1 min read

సముద్ర తీరంలో హై అలర్ట్

పాక్ - భారత్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలకు ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 110 కిలోమీ

సముద్ర తీరంలో  హై అలర్ట్
పాక్ - భారత్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలకు ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 110 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. జిల్లా పరిథిలో మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు. పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాల‌తో పహారా కాస్తున్నారు. తీర గ్రామాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు . అదే విధంగా తీర ప్రాంతం ఉన్న అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
India
High alert
Pahalgam Terror Attack
OperationSindoor
India Pakistan WAR
సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు
జిల్లా పరిథిలో మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు
Scroll for the next article