News30th Mar 12:15 PMSunil Byrisetty1 min read
ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆదివారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ విశ్వా వసునామ తెలుగ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆదివారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ విశ్వా వసునామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మర్యాద పూర్వకంగా చైర్మన్, ఈవో కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు శేషవస్త్రం, శ్రీవారి తీర్థప్రసాదాలను చైర్మన్, ఈవో కలిసి అందించారు.
వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.