News13th May 04:55 PMSunil Byrisetty1 min read

ఆదాయం పెంచండి.. డేటా లేక్ ఏర్పాటు చేయండి!

రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని... అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీఎత్తున పెరిగేలా చూడాలన

ఆదాయం పెంచండి.. డేటా లేక్ ఏర్పాటు చేయండి!
రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని... అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీఎత్తున పెరిగేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖల వారీ పురోగతిపై చర్చించారు. మరోవైపు బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ... పన్ను ఆదాయం ఆస్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని... పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని... ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
Andhra Pradesh
CM Chandra Babu
revenue generating
Artificial Intelligence
ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష
ప్రతిశాఖకు ఏఐ బృందం
పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు
Scroll for the next article