Politics10th Apr 09:15 AMSunil Byrisetty2 min read
9 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇన్ని చేసిందా!
కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక 9 నెలల్లో ఎన్నో చేసింది. అవేంటో రంగాల వారీగా చూద్దాం. పింఛన్ ఒకేసారి రూ. 4 వేలకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా 190 అన్నా క్యాంటీన్లు ప్రారంభిం
కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక 9 నెలల్లో ఎన్నో చేసింది.
అవేంటో రంగాల వారీగా చూద్దాం.
పింఛన్ ఒకేసారి రూ. 4 వేలకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా 190 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు.
దీపం పథకం కింద 48 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు.
మత్స్యకారుల ఉపాధికి అడ్డుపడేలా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన 217 జీవోను రద్దు చేశారు.
గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం కేటాయించారు. చేనేతలకు జీఎస్టీని తొలగించారు.
వారి గృహ నిర్మాణాలకు రూ. 50 వేల అదనపు సాయం అందించారు. వారికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు.
అర్చకులకు రూ. 10 వేలున్న గౌరవ వేతనాన్ని రూ. 15 వేలకు పెంచారు. ధూపదీప నైవేద్యాలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు.
వేద పండితులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు వేతనాలు పెంచారు.
రైతులకు 1670 కోట్ల బకాయిలను విడుదల చేశారు. రాజధాని రైతులకు రూ.. 400 కోట్ల బకాయిలను వెంటనే ఇచ్చారు. డ్రిప్ సబ్సిడీ పునరుద్ధరించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 4700 కోట్ల బకాయిల్లో రూ. 1400 కోట్లు విడుదల చేసి, మిగతావి ఇస్తామన్నారు.
దివ్యాంగులకు ఎన్ఐటీ, ఐఐటీ ఎంట్రన్స్ ఇబ్బందులపై మంత్రి లోకేష్ తక్షణ చర్యలు తీసుకున్నారు.
మీ సేవ సర్వీసులను పునరుద్ధరించి, 45 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. మాజీ సైనికోద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 1670 కోట్లు చెల్లించారు.
పోలవరానికి రూ. 12 వేల కోట్లు, రాజధానికి రూ. 15 వేల కోట్లు సాధించారు.
విశాఖ రైల్వే జోన్ కు 50 ఎకరాలు కేటాయించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమనేలా కేంద్రంతో ప్రకటన చేయించారు.
ఉపాధి కోసం విశాఖలో టీసీఎస్, అనకాపల్లిలో మిత్తల్, రామాయపట్నంలో బీపీసీఎల్, కర్నూలు, అనంతపురంలో టాటా పవర్, చిత్తూరులో శ్రీసిటీలో ఎల్జీ, రిలయెన్స్ తెచ్చారు.
గూగుల్, యూట్యూబ్, సిస్కోలతో ఒప్పందాలు జరిగాయి. 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి.
ల్యాండ్ టైటిలింగ్, చెత్త పన్ను రద్దు చేశారు.
ప్రజలకు స్వే్చ్ఛ ప్రసాదించారు.
కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే ఇన్ని చేసింది