News2nd May 03:12 PMSunil Byrisetty1 min read
10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందంటే..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తర్వాత 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందో చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ₹15000 కోట్లు, HUDCO ద్వారా అమరావతి నిర్మాణానికి ₹1100
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తర్వాత 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందో చూద్దాం.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ₹15000 కోట్లు, HUDCO ద్వారా అమరావతి నిర్మాణానికి ₹11000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా ₹12,157 కోట్లు, పేదలకు అందించే టిడ్కో(TIDCO) గృహాల నిర్మాణానికి ₹4400 కోట్లు, రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం ₹73,743 కోట్లు, తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో ₹2139 కోట్లతో KRIS సిటీ, అనకాపల్లి జిల్లా పూడిమడకలో ₹1,85,000 కోట్లతో NGEL గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం, అమరావతికి ₹2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు ₹11, 440 కోట్లు, విశాఖ జిల్లా నక్కపల్లిలో ₹1877కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, CRIF పథకం క్రింద 200.06 కి.మీ 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ₹400 కోట్లు, రణస్థలం 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి ₹252.42 కోట్లు, గుంటూరు - నల్లపాడు ROB నిర్మాణానికి ₹198 కోట్లు, పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కోసం ₹168 కోట్లు కేటాయించింది.