News6th Jun 04:10 PMSunil Byrisetty1 min read
సముద్రతీరంలో యోగా.. కిటకిటలాడిన బీచ్!
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రతీవ్యక్తి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపుని
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రతీవ్యక్తి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, ప్రముఖ పర్యాటక ప్రాంతం చింతపల్లి సముద్ర తీరంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించారు. వందలాదిమంది ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో బీచ్ కిటకిటలాడింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషదమని పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా నుంచి సుమారు 8 లక్షలమందిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమంలో భాగంగా ఇటీవలే రామనారాయణంలో, ఈ రోజు చింతపల్లిలో యోగా ప్రదర్శనలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో తాటిపూడి, రామతీర్ధంలో కూడా యోగా పదర్శనలు జరుగుతాయని చెప్పారు. సుమారు 5వేల మంది ఉపాధివేతనదారులతో 10వ తేదీన ఎస్.కోటలో భారీ యోగా ప్రదర్శన నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.