News29th Nov 06:02 PMSunil Byrisetty1 min read

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు

విజయవాడలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. వలరాజు, బందెల నాసర్ జీ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నార

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు
విజయవాడలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. వలరాజు, బందెల నాసర్ జీ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరికి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ కల్పిస్తామన్నారని గుర్తు చేశారు. మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తామన్నారని, యూనివర్సిటీలను పరిరక్షించి, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మెడికల్ విద్య లోని 107, 108, జీవోలను రద్దుచేసి మెడికల్ విద్యను ప్రభుత్వ పరంగా నడిపిస్తామని చెప్పి ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఖండించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ విద్యార్థులకు వారికి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 (ఏ) ప్రాథమిక హక్కులను, భావా ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు. కాబట్టే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి హక్కులను కాపాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 6400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మెడికల్ విద్యను కాపాడాలని, పిపిపి విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.
Andhra Pradesh
AISF
Medical College Privatization
AP Education
Nara Lokesh
Fee Reimbursement
Student Protest
PPP Model
Scroll for the next article