National17th Jul 01:02 PMSunil Byrisetty1 min read

భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దే

భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామన్నారు. పర్యావరణహిత ప్రా

భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దే
భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామన్నారు. పర్యావరణహిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలును తెచ్చామన్నారు. హైడ్రోజన్ రైలుతో హరియాణా పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. రూ.14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని, హైడ్రోజన్ రైలు.. జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల దూరం నడుస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా స్వచ్ఛతా మంత్రం పఠిద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు వస్తాయని తెలిపారు. 2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30 శాతం మాత్రమే ఉంటే, మేం వచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచామని ప్రధాని మోదీ వివరించారు.
India
Narendra Modi
Hydrogen Train
Indian Railways
Green Energy
Hydrogen Fuel
Haryana
Jind Sonipat
జింద్
సోనిపత్
రైల్వే అభివృద్ధి
విద్యుదీకరణ
జాతీయ వార్తలు
Scroll for the next article