News5th Apr 09:19 AMSunil Byrisetty1 min read
వారానికి రెండు రోజులే పని.. ఉద్యోగాల్లో?
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఉద్యోగాల స్వరూపం మారిపోనుంది. అన్ని రంగాల్లో ఏఐ, ఇతర సాంకేతికతల వినియోగం భవిష్యత్తును మార్చేయనున్నాయి. ఈ పరిస్థితుల్ల
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఉద్యోగాల స్వరూపం మారిపోనుంది.
అన్ని రంగాల్లో ఏఐ, ఇతర సాంకేతికతల వినియోగం భవిష్యత్తును మార్చేయనున్నాయి.
ఈ పరిస్థితుల్లో AI వినియోగం.. భవిష్యత్తుపై బిల్గేట్స్ జోస్యం చెప్పారు. ఏఐ రాక నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలెలా ఉంటాయన్నదానిపై బిల్ గేట్స్ పలు ఇంటర్వ్యూలో చెప్పారు.
అవేంటంటే వారానికి రెండు రోజులే పని ఉంటుందట. మిగిలిన రోజుల్లో ఏఐ పనిచేస్తుంది.
దాదాపు ఉద్యోగాలన్నీ ఏఐ చేతిలోకి వెళ్లిపోతాయని బాంబ్ పేల్చారు. ఏఐ వల్ల అన్ని రంగాల్లో మేథ అందరికీ ఉచితంగా లభిస్తుందన్నారు.
కేవలం కోడింగ్, బయాలజీ, ఇంధన రంగాల్లోకి మాత్రం ఏఐ రాలేదని గేట్స్ ఊహించారు.
అయితే ఇప్పటికే ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతున్న పరిస్తితుల్లో రానున్న కాలం మరింత గడ్డు పరిస్థితులను అందిస్తుందని అంచనా వేస్తున్నారు.