News4th Jul 05:56 PMSunil Byrisetty1 min read

అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు

ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు నాయడు అన్నారు. రెవెన్యూ శాఖలో ప్

అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు
ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు నాయడు అన్నారు. రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని.. గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన చేకూర్చాలని సిఎం అన్నారు. ఈ విషయంలో గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్ర స్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సిఎం సూచించారు. సచివాయంలో రెవెన్యూ శాఖపై సిఎం చంద్రబాబు సమీక్ష చేశారు. భూ సమస్యలు, ప్రజల అర్జీలు, రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ‘అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలి. ప్రభుత్వం వచ్చిన తరువాత 43.89 లక్షల మందికి కుల ధ్రువీకరణ ప్రతాల అందేజేశారు. మిగిలిన వారికి కూడా వీటిని అందించాల’ని ఆదేశించారు.
Andhra Pradesh news
Cm Chandra Babu
Permanent caste certificates by October
Revenue Department
land issues
public petitions
అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు
Scroll for the next article