News9th Apr 09:41 AMSunil Byrisetty1 min read

సిమ్ కార్డుతో భద్రతకు ముప్పు.. పాతవి మార్చేయాల్సిందే?

దేశంలో పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి రాబోతున్నాయి. వీటిపై త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న సిమ్(subscriber identity module) కార్డుల్లో చైనాకు చెందిన చి

సిమ్ కార్డుతో భద్రతకు ముప్పు.. పాతవి మార్చేయాల్సిందే?
దేశంలో పాత సిమ్ కార్డుల స్థానంలో కొత్తవి రాబోతున్నాయి. వీటిపై త్వరలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న సిమ్(subscriber identity module) కార్డుల్లో చైనాకు చెందిన చిప్ సెట్‌ల ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించే అవకాశం ఉంది. దేశంలోని టాప్ సైబర్ భద్రతా సంస్థ దర్యాప్తులో ఈ అంశాన్ని గుర్తించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NCSC), హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన దర్యాప్తులో జాతీయ భద్రతా సమస్యకు సిమ్ చిప్ సెట్లు కారణం అవుతాయని గుర్తించారు. మొదటి దశలో మొబైల్ ఫోన్‌లలో పాత సిమ్ కార్డులను మార్చే అవకాశం ఉంది. దీనికున్న సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం యోచిస్తోంది. టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ప్రతినిధులు, టెలికమ్యూనికేషన్స్ శాఖల అధికారులు ఇటీవల సమావేశాలు నిర్వహించారు. త్వరలో సిమ్ కార్డులపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
India
Replace old SIM cards
పాత సిమ్ కార్డు
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్
Scroll for the next article