News29th Mar 08:59 AMSunil Byrisetty1 min read

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండ

వైసీపీ ప్రభుత్వ హయాంలో మృతి చెందిన వైద్యుడు సుధాకర్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. విశాఖ నగరం సీతమ్మధారలోని వైద్యుడి ఇంటికి శుక్ర

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండ
వైసీపీ ప్రభుత్వ హయాంలో మృతి చెందిన వైద్యుడు సుధాకర్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. విశాఖ నగరం సీతమ్మధారలోని వైద్యుడి ఇంటికి శుక్రవారం ఆమె స్వయంగా వెళ్లి పరామర్శించారు. కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై భావోద్వేగానికి గురైన తల్లి కావేరిబాయిని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కుటుంబ సభ్యులు లేవనెత్తిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొవిడ్‌ సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు జగన్‌ ప్రభుత్వం సుధాకర్‌ను విధులు నుంచి తొలగించిందని దుయ్యబట్టారు. దీనిపై తాను టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.
vangalapudi Anitha
Dr. Sudhakar
Ap Government
Visakhapatnam
Scroll for the next article