News16th May 12:34 PMSunil Byrisetty1 min read

మొబైల్ టైలర్.. ఇంటి వద్దకే సేవలు!

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ కాలేషా టైలర్ వృతితో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తొలుత గ్రామంలో టైలరింగ్ దుకాణాన్ని నిర్వహించేవాడు. అయితే, కాలక్రమేణ షాపుకు ఆదరణ

మొబైల్ టైలర్.. ఇంటి వద్దకే సేవలు!
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ కాలేషా టైలర్ వృతితో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తొలుత గ్రామంలో టైలరింగ్ దుకాణాన్ని నిర్వహించేవాడు. అయితే, కాలక్రమేణ షాపుకు ఆదరణ తగ్గిపోయింది. కొంత మంది బట్టలు కుట్టించుకున్నా ఇచ్చే మొత్తం కంటే, అప్పులు పెట్టేదే ఎక్కువైంది. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. తెలిసిన టైలరింగ్ వృత్తి ద్వారానే ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మొబైల్ టైలరింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకున్నాడు. ఈ ఆలోచనలో భాగంగా తొలుత ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించాడు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటి వద్దే పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించాడు. ఈ సేవలకు మంచి ఆదరణ లభించటంతో.. టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి పొరుగుళ్లకు తన సేవలను విస్తరించుకున్నాడు. రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు.
Krishna District
MOBILE TAILORING
Tailor Sheik Kalesha
మొబైల్ టైలర్
గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటి వద్దే పాత
Scroll for the next article