News24th Mar 02:40 PMSunil Byrisetty1 min read

నల్లమలలో పెరుగుతోన్న పులుల సంఖ్య

ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోంది. నల్లమల అటవీ ప్రాంతం దట్టమైన కీకారణ్యం కావడంతో పులులు నివసించడానికి అనుకూలంగా ఉంది. వైల్డ్ లైఫ్ సంస్థల అంచనాల ప్రకారం ఒక పులి మన

నల్లమలలో పెరుగుతోన్న పులుల సంఖ్య
ఏపీలో నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోంది. నల్లమల అటవీ ప్రాంతం దట్టమైన కీకారణ్యం కావడంతో పులులు నివసించడానికి అనుకూలంగా ఉంది. వైల్డ్ లైఫ్ సంస్థల అంచనాల ప్రకారం ఒక పులి మనుగడ సాధించాలంటే వంద కిలోమీటర్ల కీకారణ్యం అవసరం. నల్లమలలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (NSTR) ప్రాంతం పలు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో పులుల ఆవాసంగా మారింది. ఈ అభయారణ్యంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. నల్లమలలో 2023లో 74 పులులు ఉండగా.. 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీశాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడ పులులు కాగా.. 32 మగవి అని లెక్క వేశారు. మరో నాలుగు ఏంటనేది కనిపెట్టాల్సి ఉంది. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు గుర్తించారు.
Nallamala Forest
Tigers
NSTR
ఏపీలో నల్లమల అటవీ ప్రాంతం
Scroll for the next article