News26th May 05:56 PMSunil Byrisetty1 min read

గాంధీ కొండ‌పై యోగాంధ్ర‌

దేహాన్ని దేవాల‌యంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌మిచ్చిన మ‌హాత్ముని ఆశ‌యాల కీర్తి శిఖ‌రమైన గాంధీ కొండ‌పై యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించినందుకు చాలా ఆనందంగా ఉంద‌

గాంధీ కొండ‌పై యోగాంధ్ర‌
దేహాన్ని దేవాల‌యంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌మిచ్చిన మ‌హాత్ముని ఆశ‌యాల కీర్తి శిఖ‌రమైన గాంధీ కొండ‌పై యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్స‌వాల సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని గాంధీ హిల్‌పై గాంధీ హిల్ ఫౌండేష‌న్‌, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం డిపార్టుమెంటు సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొని యోగాస‌నాలు అభ్య‌సించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్ర‌జ‌ల‌కు యోగాతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించి జీవితాంతం ఆచ‌రించేలా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, జిల్లాలోని వివిధ ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు కూడా యోగా ఔన్న‌త్యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఇందులో భాగంగా తొలుత గాంధీ హిల్‌పై నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదేవిధంగా భ‌వానీ ద్వీపం, డా. బీఆర్ అంబేద్క‌ర్ స్మృతివ‌నం, కొండ‌ప‌ల్లి ఖిల్లా త‌దిత‌ర ప్రాంతాల్లోనూ యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.
AP Tourism Department
Vijayawada
Collector Lakshmi
yoga asanas
Bhavani Island
గాంధీ కొండపై యోగాంధ్ర కార్యక్రమం
కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు
Scroll for the next article