News17th May 05:48 PMSunil Byrisetty1 min read

గ్రామ సర్పంచులతోనే ఉపాధి చెల్లింపులు

ఉపాధి హామీ పథకం చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ సర్పంచుల తోనే ఉపాధి నిధుల చెల్లింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆదేశం జారీ చేసింది. రాష్

గ్రామ సర్పంచులతోనే ఉపాధి చెల్లింపులు
ఉపాధి హామీ పథకం చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ సర్పంచుల తోనే ఉపాధి నిధుల చెల్లింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆదేశం జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎపి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఒ) ద్వారా చెల్లించే విధానం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది.
APGovt
Employment Guarantee Scheme
MGNREGA
ఉపాధి హామీ పథకం
ఉపాధి నిధుల చెల్లింపులు
గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు
రామ్ ప్రతాప్
Scroll for the next article