Politics31st Oct 03:41 PMSunil Byrisetty1 min read
దేవుడి సాక్షిగా ఆస్తి నాదే.. వేదిక మార్పు తప్పలేదు!
బెంగళూరులోని యలహంక ప్రాపర్టీ చుట్టూ తిరుగుతున్న వివాదంపై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర
బెంగళూరులోని యలహంక ప్రాపర్టీ చుట్టూ తిరుగుతున్న వివాదంపై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన ఆస్తుల పంపకాల్లో భాగంగా యలహంక ప్రాపర్టీ 100 శాతం తనకూ, తన పిల్లలకు దక్కిందని, ఇది దేవుడి సాక్షిగా నిజమని ఆమె వివరించారు. సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగమైన పోస్టు పెట్టారు. తమ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్ ఉన్న యలహంక ఇల్లు, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగిన ప్రదేశం కావడంతో తన కుమార్తె వైఎస్ అంజిలి కోరిక మేరకు వివాహాన్ని అక్కడే జరిపించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. జగన్ ప్రవర్తన కారణంగా వివాహ వేదిక విషయంలో ఉత్పన్నమైన పరిణామాలపై స్పందిస్తూ, తన బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా తమపై ఉందన్నారు. అందుకే అన్నతో అనవసర రచ్చకు తావివ్వకూడదని నిశ్చయించుకుని, యలహంక ఇంట్లో కాకుండా వేరే వేదికలో జరిపించాలని నిర్ణయించినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.