Life Style28th Aug 08:36 AMSunil Byrisetty1 min read
రాఖీ పూర్ణిమ విశిష్టత ఇదే!
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజున సోదరులకు అక్కా చెల్లెళ్లు రాఖీకట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ‘ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజున సోదరులకు అక్కా చెల్లెళ్లు రాఖీకట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది.
‘ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం’ అంటూ రక్షకోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురు నిలిచాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ సోదరుడు ఆశీర్వదిస్తాడు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు.
దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు కారణాలు, చరిత్రలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిలి చేష్టలతో మానవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను ఇలానే చేసుకుంటాం.
ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని అక్కచెల్లెళ్లంతా అన్నదమ్ములకి రాఖీని కడతారు.