Spiritual20th Oct 09:35 AMSunil Byrisetty1 min read

దీపావళి పండుగ విశేషం!

దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల

దీపావళి పండుగ విశేషం!
దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి. దీపావళి ఈ పండుగను ఆచరించే విధానంలో అనేక గాధలున్నాయి. 1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్యదానము, 3. శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట (భరత్ మిలాప్), 4. విక్రమార్క చక్రవరి పట్టాభిషేకం. భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను. నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు. భరత్ మిలాప్ : శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా "భరత్ మిలాప్" అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు.
Deepavali
Diwali Festival
South India Traditions
Naraka Chaturdashi
Balipadyami
Bharat Milap
Lord Krishna
Lord Rama
Indian Culture
Festival of Lights
భారతీయ సంప్రదాయాలు
దక్షిణ భారత ఆచారాలు
ఆధ్యాత్మికత
భక్తి
సంస్కృతి
Scroll for the next article