News17th May 12:27 PMSunil Byrisetty1 min read
శ్రీలంకను తాకిన నైరుతి రుతుపవనాలు!
నైరుతి రుతుపవనాలు శ్రీలంకను తాకాయి. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదలడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్త
నైరుతి రుతుపవనాలు శ్రీలంకను తాకాయి.
రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదలడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఈరోజు అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.