Politics26th Mar 12:23 PMSunil Byrisetty1 min read

జగన్ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామ మోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జగన్ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులే
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామ మోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విద్యుత్ షాకులు పేరుతో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే వినియోగదారుల జేబులకు కత్తెరవేసే టైం ఆఫ్ డే టార్ఫ్ విధానాన్ని చిరు వ్యాపారులకు సైతం అమలు చేస్తామని ప్రకటించడం దారుణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. సోలార్ విద్యుత్తు యూనిట్ 1.99 కి టెండర్లు పడిన రోజుల్లో సేకీతో 2.49 రూపాయలకి కొంటామని ఒప్పందం చేసుకోవడం సరైనది కాదన్నారు. సేకీతో ఒప్పందం చేసుకోవడాన్ని తొలి నుండి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సెకితో ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు లక్ష కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఇది మోయలేని భారం అవుతుందని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, సెకి ఒప్పందాలు రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ డే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ మీద ఈనెల 28వ తేదీన కడప నగరంలోని మహవీర్ సర్కిల్ వద్ద ఉన్న విద్యుత్ భవనం ఎదుట ఆందోళన చేపట్టాలని సీపీఎం నిర్ణయించిందన్నారు.
AP Government
Smart Meters
ఎ. రామ మోహన్
విద్యుత్
Scroll for the next article