News7th Jun 05:19 PMSunil Byrisetty1 min read
ఎండల తీవ్రత.. రహదారులు నిర్మానుష్యం!
మంగళగిరి రోహిణి కార్తె వెళ్లిపోయింది. ఇక వేసవి నుంచి బయటపడ్డాం. అనుకున్నవారికి ఇది ఊహించని పరిణామమే అని చెప్పాలి. మే నెల చివరలో వర్షాల వలన వాతావరణం చల్లబడినప్పటికీ, గత నాలుగు రోజుల
మంగళగిరి రోహిణి కార్తె వెళ్లిపోయింది. ఇక వేసవి నుంచి బయటపడ్డాం. అనుకున్నవారికి ఇది ఊహించని పరిణామమే అని చెప్పాలి. మే నెల చివరలో వర్షాల వలన వాతావరణం చల్లబడినప్పటికీ, గత నాలుగు రోజులుగా భానుడు భగభగమంటున్నాడు. ఎండలు మండుతున్నాయి. దీంతో మంగళగిరిలో ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత జనం రోడ్లపైకి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎండల తాకిడికి వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రుతుపవనాల కదలికలు వేగం పెరిగితే కానీ వర్షాలు పడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పవచ్చు.