News17th May 12:35 PMSunil Byrisetty1 min read

విజయనగరంలో "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్"

విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుచున్న "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్" కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం విజయనగరం నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో "స్వచ్చ

విజయనగరంలో "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్"
విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుచున్న "స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్" కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం విజయనగరం నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో "స్వచ్చ ఆంధ్ర - స్వచ్ఛ దివస్"ను చేపట్టారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం నుండి కోట జంక్షన్ వరకు కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోట జంక్షన్ వద్ద మజ్జిక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, విజయనగరం 47వ వార్డు పరిసర ప్రాంతంలో ఉన్న పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, కూటమి ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.
Vizianagaram
Swachh Andhra Swachh Diwas program
Kalisetti Appalanaidu
విజయనగరంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్
విజయనగరం నగరపాలక సంస్థ
Scroll for the next article