News17th Jul 03:23 PMSunil Byrisetty1 min read
రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధం అమలు చేయాలి
రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అధికార
రైతు బజార్లలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా అధికారులను ఆదేశించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో మార్కెటింగ్, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రైతు పండించిన పంటను నేరుగా అమ్మకాలు నిర్వహించి రైతులు, వినియోగదారులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అర్బన్‌లో తొమ్మిది, రూరల్ లో ఆరు మొత్తంగా 15 రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని రైతు బజార్లలో కచ్చితంగా అమలు చేయాలన్నారు.
రైతు బజార్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. ఉదయం ఆరు గంటలకే అన్ని రైతు బజార్లలో ఎస్టేట్ అధికారులు విధులలో ఉండి ధరల పట్టికను సిద్ధంగా ఉంచాలన్నారు. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలకే రైతు బజార్లలో అమ్మకాలు నిర్వహించేలా ఎస్టేట్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.